యువ గళం న్యూస్ ఎడిటర్ బుర్రి వెంకట్

​వేదాద్రి (జగ్గయ్యపేట): స్థానిక పవిత్ర కృష్ణా నదీ తీరాన 'పంచ నరసింహ క్షేత్రం'గా వెలసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో వైఖానస ఆగమ సంప్రదాయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అష్టకలశారాధన, స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం అగ్ని ధ్యాన ఆరాధనలు, ప్రధాన హోమం, వాహనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, ధర్మకర్త డాక్టర్ వెలగపూడి లక్ష్మణ ఇందిరా దత్తు ప్రతినిధిగా రాంప్రసాద్ పాల్గొన్నారు. కాగా, గురువారం ఉదయం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుందని, ఈ సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ వెలగపూడి లక్ష్మణ ఇందిరా దత్తు స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు తెలిపారు.