యువ గళం న్యూస్ ఎడిటర్ బుర్రి వెంకట్
వేదాద్రి (ఎన్టీఆర్ జిల్లా):
ప్రసిద్ధ పంచ నరసింహ క్షేత్రమైన వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానమును శుక్రవారం పూర్వ శాసన మండలి సభ్యుడు తొండపు దశరధ జనార్ధన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి (ఈఓ) కానూరి సురేష్ బాబు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితులు, అర్చకులచే స్వామి వారికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించబడ్డాయి.
దర్శనానంతరం ఆలయ అధికారులు మరియు అర్చకులు తొండపు దశరధ జనార్ధన్‌ను శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగింది.
కార్యనిర్వాహణా అధికారి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం,
వేదాద్రి, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా.