జగ్గయ్యపేట (రూరల్), జూన్ 8 యువ గళం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా, ఎన్.టి.ఆర్. జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామములోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో సోమవారం ఉదయం యోగా శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 7:30 గంటల నుండి 8:30 గంటల వరకు ఈ శిక్షణ సాగింది.
ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీ కానూరి సురేష్ బాబు, దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ శ్రీమతి వెలగపూడి లక్ష్మణ ఇందిరా దత్తు ప్రతినిధి రామ్ ప్రసాద్, ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని యోగాసనాలు వేశారు. మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.